Prabhas’ Spirit Release Date Announced: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ఈ సినిమాపై అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి సినీ సర్కిల్స్, పాన్ ఇండియా ఆడియన్స్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాస్ – సందీప్ వంగ లాంటి క్రేజీ కాంబో కావడంతో పాటు, ఇందులో ప్రభాస్ తన కెరీర్లో మొదటి సారి ఎప్పుడూ చూడని విధంగా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటిస్తుండటం విశేషం. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్, అప్డేట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్లో ప్రభాస్ బ్లాక్ క్యాప్, స్టైలిష్ గాగుల్స్తో గడ్డంతో అత్యంత రగ్డ్ అండ్ ఇంటెన్స్ సీరియస్ లుక్లో కనిపిస్తున్నాడు. అంతేకాదు.. ఈ తాజాగా అప్డెట్లో సినిమా రిలీజ్ తేదీ ప్రకటించేశారు.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన టాలెంటెడ్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2025 నవంబర్లో ఓపెనింగ్ జరగ్గా కొన్ని నెలల క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమాను, మొదట 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా చిత్ర బృందం అభిమానులకు మెగా ట్రీట్ ఇస్తూ కొత్త రిలీజ్ డేట్ను ఖరారు చేసింది. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2027 దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా కోసం ఇంకా సంవత్సరం వెయిట్ చేయాలా అని కొద్దిగా నిరాశలో ఉన్నప్పటికీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఎంతో ధీమాతో ఎదురుచూస్తున్నారు.

