పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గొప్ప మనసు గురించి టాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకుంటారు. తాజాగా ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ రిద్ధి కుమార్ చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఈవెంట్‌కు ఆమె కట్టుకొచ్చిన తెల్లటి చీరను ప్రభాస్ స్వయంగా గిఫ్ట్‌గా ఇచ్చారని, దానిని మూడేళ్లుగా దాచుకుని ఇప్పుడు కట్టుకున్నానని చెప్ప డంతో వీరిద్దరి మధ్య ఏదో ‘రిలేషన్’ ఉందంటూ రూమర్స్ షురూ అయ్యాయి. ఈ వార్తలపై రిద్ధి కుమార్ తాజాగా పుల్ క్లారిటీ ఇచ్చింది.
Also Read : Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – స్వరూప్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నాగవంశీ.
అసలు ఆ గిఫ్ట్ వెనుక ఉన్న స్టోరీని వివరిస్తూ.. ‘మూడేళ్ల క్రితం ప్రభాస్ గారి పుట్టినరోజు నాడు నేను ‘రాజా సాబ్’ సెట్స్‌లోకి అడుగుపెట్టాను. ఆయనకు ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకున్నాను. అప్పట్లో నేను ఆయన కోసం ‘కర్ణుడి’ తత్వం ఉన్న ‘మృత్యుంజయ్’ అనే పుస్తకాన్ని బహుమతిగా తీసుకెళ్లాను. దానికి బదులుగా ప్రభాస్ గారు నాకు దీపావళి కానుకగా ఈ చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆయనది కర్ణుడి లాంటి దాన గుణం’ అని ఆమె తెలిపింది. ఆ రోజు ప్రభాస్ చూపిన అభిమానానికి గుర్తుగానే ఆ చీరను ఇంతకాలం దాచుకున్నానని, ఇందులో ఎలాంటి ఇతర అర్థాలు లేవని ఆమె స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చెలరేగుతున్న పుకార్లకు చెక్ పడినట్లయింది.
