NTV Telugu Site icon

Prabhas Disappointing Fans : డార్లింగ్ ఫ్యాన్స్‎కు మరో బ్యాడ్ న్యూస్

Prabhas Birthday

Prabhas Birthday

Prabhas Disappointing Fans : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. పాన్ ఇండియా స్టార్‎గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారని ఓ వైపు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు…. కానీ చేసిన సినిమాలు అన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల సంక్రాంతి బరిలో ఆదిపురుష్ సినిమా ఉంటుందని అంతా భావించారు. ఈ క్రమంలో విడుదలైన టీజర్ చూసిన తర్వాత వారు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్ మళ్లీ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. ఇందుకు చిత్ర బడ్జెట్ ను మరో రూ.100కోట్లు వెచ్చిస్తోంది. విఎఫ్ఎక్స్ కారణంగా సంక్రాంతికి వస్తుందన్న సినిమా కాస్త జూన్ 16కు వెళ్లిపోయింది.

Read Also: Kalyan Ram: కల్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ

వచ్చే ఏడాదంతా తమ సినిమా హీరో హవానే కొనసాగుతుందనే ధీమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆదిపురుష్ విడుదల అయిన కొద్ది రోజులకే సలార్ వస్తుందని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు సలార్ సినిమాను కూడా వాయిదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు వాయిదా పడ్డట్లే అని తెలుస్తోంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా వచ్చే సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. ఆదిపురుష్ ఎఫెక్ట్ పుణ్యమాని ఇప్పుడు సెప్టెంబర్లో వస్తుందనుకున్న సినిమాను మరో మూడునెలలు ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తుందంట చిత్రబృందం. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తుండడగా జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Danger with Non Stick Pans : ఆ పాత్రలు వాడితే ఆస్పత్రి పాలు కావాల్సిందే

Show comments