NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

Bhairava

Bhairava

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుండి స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేసారు.

Read Also :Ramcharan : భారీగా రెమ్యూనరేషన్ పెంచిన గ్లోబల్ స్టార్.. ఆ సినిమా కోసం అన్నీ కోట్లా..?

హైదరాబాద్ లోని రామోజీ ఫీల్ సిటీ లో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి బుజ్జి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ సినిమాలో బుజ్జి పేరు చిన్నగా వున్నా కూడా దాని పాత్ర చాలా ప్రత్యేకం అని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం బుజ్జి కార్ తో మేకర్స్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.దేశంలోని ప్రధాన నగరాలలో బుజ్జి తిరుగుతూ ఎంతగానో సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పై ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.జూన్ మొదటి వారంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Show comments