NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌ ఈ మూవీని బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది.ఈ సినిమాలో కమల్,అమితాబ్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేసింది.దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

Read Also :Satyabhama: “క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” బాలయ్యపై కాజల్ కామెంట్స్..

తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయినా బుజ్జిని చిత్ర యూనిట్ గ్రాండ్ గా పరిచయం చేసింది.బుజ్జి ఎవరంటే ఒక రోబోటిక్ కార్.ఈ సినిమాలో బుజ్జి ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ ..బుజ్జి పాత్రకు మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AA క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది .

Show comments