NTV Telugu Site icon

Kalki 2898 AD : సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్న ప్రభాస్ కల్కి .. రన్ టైం ఎంతంటే..?

Kalki (3)

Kalki (3)

Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం  ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.

Read Also :Spirit : డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న ప్రభాస్..?

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.రీసెంట్ గా ఈ చిత్రం నుండి భైరవ యాంతం ను రిలీజ్ చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఈ సినిమా రన్ టైం 3 గంటల 56 సెకండ్స్ అని తెలుస్తుంది.ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయని సెన్సార్ సభ్యుల తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం కల్కి మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు.త్వరలోనే అమరావతిలో  ఓ భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

Show comments