NTV Telugu Site icon

Prabhas: అభిమాని మరణిస్తే ప్రభాస్ చేసిన పనికి శబాష్ అనాల్సిందే..

Prabhas

Prabhas

హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరో ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీబిజీగా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం కాబోతున్న కల్కి 2829 ఏడి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అమితాబచ్చన్, అలాగే సుప్రసిద్ధ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Cannes 2024: భారతీయ చిత్రానికి కేన్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డు

ఇక సినిమాలు ఒకవైపు ఉంటే మరోవైపు ప్రభాస్ తన సంపాదనలో చాలా భాగం దానధర్మాలకు కేటాయించడం మనం చూస్తూనే ఉంటాం. ఇదివరకు కోవిడ్ సమయంలో కూడా ప్రభాస్ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విరాళాలు అందించి ప్రజలకు సేవ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఏకంగా 35 లక్షల విరాళం ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక తన స్నేహితులకి, తన తోటి నటులకు, అలాగే ఎవరైనా అతిథిలకి వస్తే చాలు ప్రభాస్ వారికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారన్న విషయం ఎంతోమంది నటీనటులు చెప్పిన విషయం తెలిసిందే.

Tension in Karimnagar: హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్తత.. ఆరుగురిపై కేసు నమోదు..

ఇకపోతే తాజాగా కరీంనగర్ కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఈ మధ్యకాలంలో మరణించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న హీరో ప్రభాస్ ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో వెంటనే వారి కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం అందించమని ప్రభాస్ పిఏ రామకృష్ణను శనివారం నాడు రమేష్ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించాడు. అంతేకాకుండా అతని పేరిట కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో దాక ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. దాంతో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.