NTV Telugu Site icon

Prabhas: పెళ్లి పై ఎట్టకేలకు ఓపెన్ అయిపోయిన ప్రభాస్ షాకింగ్ కామెంట్స్..

Prabhas Kalki

Prabhas Kalki

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రభాస్ అన్న పేరు టక్కున వినిపిస్తుంది.. అయితే ప్రభాస్ పెళ్లి గురించి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి పై మాట మారుస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో సార్లు పెళ్లి పై రూమర్లు వచ్చాయి.. కానీ డార్లింగ్ మాత్రం స్పందించలేదు.. తాజాగా కల్కి ఈవెంట్ లో పెళ్లి పై ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు.. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

గతంలో ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని వార్తలు వినిపించాయి. ఇకపోతే ఆది పురుష్ సినిమా చేస్తున్న సమయంలో కృతి సనన్ తో కూడా పెళ్లి పీటలేకపోతున్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా స్పందించలేదు.. కేవలం సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. కల్కి సినిమా తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..

ఇటీవలే డార్లింగ్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశాడు.. ప్రభాస్ లైఫ్ లోకి ఏదో అమ్మాయి వస్తుంది అని అందరూ అనుకున్నారు. చాలామంది కథనాలు కూడా రాయటం మొదలు పెట్టారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రాజెక్ట్ కి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఆ పోస్టు పెట్టాడు ప్రభాస్.. కల్కి ఈవెంట్ లో డార్లింగ్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.. యాంకర్ సుమ పోస్ట్ గురించి అడిగింది.. అమ్మాయిలు బాధ పడతారని ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని చెప్పాడు.. కానీ పెళ్లి చేసుకుంటాడా.. లేదా అన్నది మాత్రం చెప్పలేదు..