Site icon NTV Telugu

The Raja Saab: రాజాసాబ్ థియేటర్‌లో మంటలు

The Raja Saab

The Raja Saab

The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా అభిమానుల సందడి ఒక రేంజ్ లో ఉంది. అయితే, ఇదే ఉత్సాహం ఒడిశాలోని రాయగడలో ఒక పెను ప్రమాదానికి దారితీసేలా చేసింది, అత్యుత్సాహంతో కొందరు చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయగడలోని ఒక సినిమా థియేటర్‌లో ‘రాజా సాబ్’ ప్రదర్శన జరుగుతుండగా, ప్రభాస్ ఎంట్రీ సీన్ వద్ద అభిమానులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వెండితెరపై తమ అభిమాన హీరోను చూడగానే ఆనందంతో థియేటర్ లోపలే టాపాసులు పేల్చారు. అవి పేల్చినప్పుడు వచ్చిన నిప్పురవ్వలు స్క్రీన్ ముందు విసిరేసిన పేపర్ ముక్కలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడాన్ని గమనించిన హాల్ యాజమాన్యం, అక్కడి ప్రేక్షకులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

READ ALSO: Homemade Perfume: మీ ఇంట్లోనే పెర్ఫ్యూమ్ తయారు చేసుకోవచ్చు.. ఎలానో చూసేయండి!

ఒకవేళ ఆ మంటలు సినిమా స్క్రీన్‌కు కానీ లేదా పక్కనే ఉన్న సీట్లకు కానీ అంటుకుని ఉంటే, థియేటర్ మొత్తం అగ్నిప్రమాదానికి గురయ్యేదని, భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమా అంటే వినోదం, హీరోల మీద ఉండే అభిమానాన్ని చాటుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇలా నిబంధనలకు విరుద్ధంగా థియేటర్ లోపల టపాసులు పేల్చడం ‘దారుణం’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్న నిప్పురవ్వ పడినా అది భారీ విపత్తుకు దారితీస్తుంది. కాబట్టి, అభిమానులు సంయమనం పాటించాలని, ఇలాంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని సినీ ప్రముఖులు కూడా సూచిస్తున్నారు.

READ ALSO: Chiranjeevi: శంకర్ వరప్రసాద్ గారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Exit mobile version