NTV Telugu Site icon

Kalki 2898 AD: ఏయ్ బాబు లెవ్.. అప్టేట్ కావాలి! ఇదేం ట్రెండ్ మావా?

Kalki 2898 Ad

Kalki 2898 Ad

Prabhas Fans Wants Kalki 2898 AD Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడీ సాంగ్ షూటింగ్ కోసం మూవీ టీమ్ ఇటలీ వెళ్లింది.

వైజయంతీ మూవీస్‌ సెంటిమెంట్‌లో భాగంగా కల్కి 2898 ఏడీని మే 9న విడుదల చేయాలనుకున్నారు. అయితే సార్వత్రిక ఎలక్షన్స్ కారణంగా ఈ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. సరిగ్గా కల్కి రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్టేడ్ ఇవ్వడం లేదు. పోనీ ఉగాది పండగ సందర్భంగా అయినా అప్టేట్ ఇస్తారా? అంటే.. అది కూడా లేదు. దీంతో కల్కి అప్టేట్ కావాలంటూ.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా అప్టేట్ ఇవ్వాలంటూ.. ఏయ్ బాబు లేవు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.

Also Read: Jaydev Unadkat Bowling: నరాలు తెగే ఉత్కంఠ.. భయపెట్టిన జయదేవ్‌ ఉనాద్కట్‌! వీడియో వైరల్

మరోవైపు కల్కి 2898 ఏడీని మే ఎండింగ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మే 30న ఈ సినిమా రిలీజ్ అవడం గ్యారెంటీ అంటున్నారు. ఆరోజు గురువారం అవుతోంది కాబట్టి లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని భావిస్తున్నారు. కానీ ఇదే విషయాన్ని మేకర్స్ అఫిషీయల్‌గా ఎందుకు చెప్పడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. కల్కి మరింత వెనక్కి వెళ్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఎప్పుడు అప్టేడ్ ఇస్తుందో చూడాలి.

Show comments