Deepika Padukone : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ”.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని ప్రభాస్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రీలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ ని ‘బుజ్జిని’ పరిచయం చేసారు.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో ప్రత్యేకమని హీరో ప్రభాస్ తెలిపారు.
Read Also :Manamey : శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ పై స్పెషల్ అప్డేట్ వైరల్..
అయితే ఈ భారీ ఈవెంట్ కి హీరోయిన్ దీపికా పదుకోన్ హాజరు కాలేదు.అయితే దానికి కారణం కూడా వుంది దీపికా ప్రెగ్నెంట్ గా వున్న కారణంగా బుజ్జి ప్రమోషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు.ఈవెంట్ కి రాలేకపోయినా కనీసం సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ దీపికా తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో సినిమా గురించి ఎందుకు ప్రమోట్ చేయడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.దీపికా ఇప్పటి వరకూ కల్కి గురించి తన ఇంస్టాగ్రామ్ లో కేవలం రెండు పోస్టులు మాత్రమే పెట్టింది.ఆ రెండు పోస్ట్ లలో ఒకటి కల్కి మూవీ మొదలైనప్పుడు, రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఒకటి వుంది.కల్కి సినిమాపై దీపికా తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఇప్పటికైనా సినిమా ప్రమోషన్స్ చేయండని కామెంట్స్ చేస్తున్నారు.
