NTV Telugu Site icon

Kalki 2898 AD X Review: ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్ బస్టర్ బొమ్మ.. ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేయొచ్చు!

Kalki 2898 Ad

Kalki 2898 Ad

Prabhas’s Kalki 2898 AD Twitter Review: యావత్‌ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని చూసిన సమయం రానే వచ్చింది. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పాటని, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్‌ నటించడంతో కల్కిపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఈరోజు రిలీజ్ అయిన కల్కి సినిమా టాక్ సోషల్ మీడియాలో ఎలా ఉందో ఓసారి చూద్దాం.

అమెరికాలో ఇప్పటికే పలు షోలు పూర్తవగా.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే కల్కి 2898 ఏడీ స్పెషల్‌ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు నెట్టింట తమతమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కల్కి రెండో భాగం అరాచకం. బ్లాక్ బస్టర్ బొమ్మ. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేయొచ్చు’ అని ఒకరు ట్వీట్ చేశారు. ‘మంచి కథ, అశ్వథామ, క్లైమాక్స్ బాగున్నాయి. మొదటి భాగం బాగుంది. మొత్తానికి సినిమా ఓకే’ అని ఇంకొకరు పేర్కొన్నారు.

Also Read: Rahul gandhi: పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరుకు కోర్టు ఆదేశం

‘కల్కి 2898 ఏడీ ఇప్పుడే చూశాను. కల్కి సినిమాటిక్ యూనివర్స్. సినిమా గురించి చెప్పడానికి పదాలు లేవు, ముఖ్యంగా చివరి 30నిమిషాలు గూస్‌బంప్స్. చూడవలసినవి సినిమా’ అని ఓ అభిమాని ఎక్స్‌లో పేర్కొన్నాడు. ‘దీపికా పదుకొణె డానరీస్ టార్గెరియన్‌గా నటించింది. ఇది నాకు ఉత్తమమైన నాన్ హీరోయిక్ గూస్‌బంప్స్ క్షణం’ అని మరొకరు ట్వీట్ చేశారు. మొతానికి కల్కి సినిమాకు మంచి టాక్ వచ్చింది.

Show comments