NTV Telugu Site icon

Apple Layoff : భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న యాపిల్ కంపెనీ..

Apple Cmpny

Apple Cmpny

గత ఏడాది నుంచి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు.. ఆర్థిక కారణాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు.. ఇప్పటికి ఉద్యోగుల ఊచకోత కొనసాగుతుంది.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ యాపిల్ కూడా తమ ఉద్యోగుల పై వేటు వేసింది.. భారీగా ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో యాపిల్ సంస్థ ఉంది..

తమ కంపెనీ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్‌ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును కూడా ఆపేసిందట.. ఆ ప్రాజెక్టు లోని ఉద్యోగులపై లేఆఫ్ ప్రకటించిందని సమాచారం..

మొన్న విఫ్రో, మైక్రో సాఫ్ట్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఆర్థిక కారణాల వల్ల వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే.. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీ పునర్వవస్థీకరణ, వ్యయం తగ్గింపు , అప్‌డేటెడ్‌ టెక్నాలజీ వినియోగం, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.. ఇక నెక్స్ట్ ఏ కంపెనీ ఉద్యోగాలను తొలగిస్తుందో అని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు..