Site icon NTV Telugu

PPF Scheme: పీపీఎఫ్‌లో సూపర్ స్కీమ్‌.. నెలకు రూ.5 వేలతో, రూ.42 లక్షలు పొందవచ్చు..

Ppf Account

Ppf Account

రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా మంది పొదుపు పథకాల్లో డబ్బులను పెడుతున్నారు.. ఎటువంటి స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయనేది తెలుసుకోవడం మంచిది.. మీరు PPF పథకంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు..

పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో లాభదాయకమైన ఒప్పందం. వాస్తవానికి అధిక వడ్డీతో పాటు, మీ డిపాజిట్లపై ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే రాబడి పూర్తిగా పన్ను రహితం. ఈ పథకంలో చక్రవడ్డీ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. దీనితో పాటు, మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పీపీఎఫ్‌లో పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు.. అతి తక్కువ అమౌంట్ రూ.500 లతో పెట్టుబడి పెట్టుకోవచ్చు.. గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 15 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంది. అంటే మీరు ఈ కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. కానీ మీరు మెచ్యూరిటీ తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించాలనుకుంటే,మీరు మీరు పీపీఎఫ్‌ ఖాతాను 5 సంవత్సరాల పాటు పొడిగించవచ్చు.

నెలకు రూ. 5000 మాత్రమే ఆదా చేయడం ద్వారా రూ. 42 లక్షల నిధిని ఎలా కూడబెట్టుకోగలడు. దీన్ని లెక్కించే ముందు, ఈ పథకంలో పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీ రేటు ఇవ్వబడిందని తెలుసుకోండి. నెలకు రూ. 5000 డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరంలో రూ. 60,000 PPF ఖాతాలో జమ చేయబడుతుంది.15 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్ రూ. 9,00,000 అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూ. 7,27,284 అవుతుంది.. ఇకపోతే పెట్టుబడి కాలం 6 సంవత్సరాలు ఉండాలి. మీరు 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టిన తర్వాత మాత్రమే దీని కింద రుణం కూడా తీసుకోవచ్చు.. ఈ స్కీమ్ ను ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మీరు పీపీఎఫ్‌ ఖాతాను తెరవవచ్చు. దీని కోసం భారతీయ పౌరుడిగా ఉండటం అవసరం.. మైనర్ పిల్లల పేరుతో కూడా సంరక్షకుడు ఖాతాను తెరవచ్చు..

Exit mobile version