Earthquake: అలస్కా, కెనడా భూభాగంలోని యుకాన్ సరిహద్దుల్లోని ఒక మారుమూల ప్రాంతంలో శనివారం 7.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. అలాగే ఎక్కడా ప్రాణ నష్టం లేదా ఆస్థి నష్టం నివేదికలు లేవని అధికారులు తెలిపారు. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. ఈ భూకంపం అలస్కాలోని జూనోకు వాయువ్యంగా సుమారు 230 మైళ్లు (370 కిలోమీటర్లు), యుకాన్‌లోని వైట్‌హార్స్‌కు పశ్చిమాన 155 మైళ్లు (250 కిలోమీటర్లు) దూరంలో సంభవించింది. భూకంపం సుమారు 6 మైళ్ల (10 కిలోమీటర్లు) లోతులో సంభవించింది. భూకంపం తర్వాత అనేక చోట్ల ప్రకంపనలు సంభవించాయి.
Gautam Gambhir: మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది.. టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు..!
యుకాన్ రాజధాని వైట్‌హార్స్‌లో భూకంపం ప్రకంపనలు బలంగా అనిపించాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) సార్జెంట్ కాలిస్టా మాక్లియోడ్ తెలిపారు. తమకు భూకంపం గురించి కాల్స్ వచ్చాయని, సోషల్ మీడియాలో కూడా చాలా మంది దీని గురించి చర్చించుకున్నారని ఆమె అన్నారు. కెనడియన్ కమ్యూనిటీలలో భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం హేన్స్ జంక్షన్ అని నేచురల్ రిసోర్సెస్ కెనడాకు చెందిన భూకంప శాస్త్రవేత్త తెలిపారు. అలాగే అలస్కాలోని యకుటాట్ పట్టణానికి సుమారు 56 మైళ్ల (91 కిలోమీటర్లు) దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఆలిసన్ బర్డ్ మాట్లాడుతూ.. భూకంపం ఎక్కువగా ప్రభావితం చేసిన యుకాన్ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో అక్కడ జనాభా తక్కువగా ఉందని తెలిపారు. చాలా వరకు వస్తువులు అల్మారాల నుండి లేదా గోడల నుండి కింద పడ్డాయని మాత్రమే ప్రజలు తెలిపారని.. అయితే ఆస్తి నష్టం జరిగినట్లుగా మాకు ఎక్కడా నివేదికలు అందలేదని ఆమె తెలిపారు.
Scrub Typhus Ravaging AP: ఏపీని వణికిస్తున్న స్రబ్ టైఫన్.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
