Site icon NTV Telugu

PSPK32 : పవర్ స్టార్.. సురేందర్ రెడ్డి సినిమా అప్డేట్ వచ్చేసింది.. షూట్ స్టార్ట్ ఎప్పుడంటే?

Pspk 32

Pspk 32

ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. చాలా కాలానికి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవుతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఉస్తాద్ తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా? లేదా? అనే డైలామాలో ఉన్నారు అభిమానులు.

ఇప్పటికే ఆయన ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుందో చెప్పడం కష్టం. కానీ, గతంలోనే పవన్ ఓ సినిమా ప్రకటించారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమా అనౌన్స్ చేశారు. కానీ, ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అటకెక్కిందని అనుకున్నారు. అయితే, తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మాతగా.. వక్కంతం వంశీ అందించిన కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పవన్ కళ్యాణ్ మిత్రుడు రామ్ తాళ్లూరి ఎక్స్ వేదికగా స్పందిస్తూ    ‘జైత్ర రామ మూవీస్ సంస్థపై ప్రొడక్షన్ నంబర్ 1గా.. నా డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను. మన ప్రియతమ పవర్ స్టార్ అశీసులతో, ప్రేమతో ఆయన పేరు పెట్టిన బ్యానర్ మీద సినిమా చేస్తున్నాను. ‘.. అని రామ్ తాళ్ళూరి ట్వీట్ చేశారు.  సమ్మర్ నుండి ఈ సినిమా షూట్ కానుంది.

Exit mobile version