NTV Telugu Site icon

Bird Flu : నిజామాబాద్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం..

Bird Flu

Bird Flu

Bird Flu : తెలంగాణ రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతుండటంతో నిర్వాహకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ మండలం చేతన్‌నగర్ శివారులో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్‌లో గత రెండు రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.

జల్లాపల్లి గ్రామానికి చెందిన రవి చేతన్‌నగర్ శివారులో కోళ్ల ఫామ్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం , మంగళవారం రోజుల్లోనే దాదాపు 5 వేల కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి. దీంతో రవికి రూ.7 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తాను భారీ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నట్లు బాధను వ్యక్తం చేశాడు. కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమవుతోందేమో అనే అనుమానంతో, అధికారులను సమాచారం అందజేశారు.

ఇక వేల్పూర్ మండలం లక్కోర గ్రామానికి చెందిన కొట్టాల గోవర్ధన్ నిర్వహిస్తున్న మరో పౌల్ట్రీ ఫామ్‌లో కూడా మంగళవారం 25 కోళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించి, మరణాలకు గల కారణాలను పరిశీలించారు. కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

ప్రస్తుతం ఈ ఘటనలపై అధికారులు వేగంగా స్పందిస్తూ అనుమానాస్పద కోళ్ల మరణాలకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పౌల్ట్రీ రైతులు స్వరక్షణ చర్యలు చేపట్టాలని, కోళ్లకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారుల సూచనలు అందిస్తున్నారు.

Donald Trump: గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు