NTV Telugu Site icon

Vegetable Prices : ఆకాశాన్నంటిన ఆలు, ఉల్లి, టమాటా ధరలు.. ఏడాదిలో 81 శాతం పెరుగుదల

New Project (46)

New Project (46)

Vegetable Prices : దేశంలో కూరగాయల ధరలు భారీగా పెరిగనట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత 15 రోజుల్లో ఉల్లి టోకు ధరలు 50 శాతం వరకు పెరిగాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ డేటాను పరిశీలిస్తే.. గత ఏడాది కాలంలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు 81 శాతం వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు కూరగాయల సగటు ధరల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. గత ఏడాది కాలంలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టొమాటోల ధరల్లో ఎంత పెరుగుదల కనిపించిందో గణాంకాల ద్వారా తెలుసుకుందాం.

గత ఏడాదిగా పెరిగిన ఆలుగడ్డ ధర
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 30, 2023న బంగాళదుంప సగటు ధర కిలోకు రూ. 18.88. ఇది జూన్ 10, 2024 నాటికి కిలో రూ. 30.57కి చేరింది. అంటే బంగాళదుంప ధర కిలో రూ.11.69 పెరిగింది. అంటే గత ఏడాది కాలంలో బంగాళదుంపల ధరలు 62 శాతం పెరిగాయి. జూన్ నెలలో బంగాళదుంపల సగటు ధర కిలోగ్రాముకు ఒక రూపాయి పెరిగింది.

ఏడాదిలో రూ.13.50కి పెరిగిన ఉల్లి ధర
గతేడాది నుంచి ఉల్లి ధరలు సామాన్యులను కంటతడి పెట్టిస్తున్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఏప్రిల్ 30, 2023న కిలో ఉల్లిపాయల సగటు ధర రూ. 20.41. జూన్ 10 నాటికి రూ.33.98కి పెరిగింది. అంటే గత ఏడాది కాలంలో ఉల్లి ధర 66 శాతం పెరిగింది అంటే కిలో రూ.13.57. జూన్ నెలలో ఉల్లి సగటు ధర కిలోకు రూ.1.86 పెరిగింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర రూ.12 పెరిగింది.

Read Also:Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!

60శాతానికి పైగా పెరిగిన టమాటా ధర
బంగాళదుంపలు, ఉల్లిపాయలతో పోలిస్తే టమాటా ధర అత్యధికంగా పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 30, 2023న టమోటా రిటైల్ ధర కిలోకు రూ. 20.55. జూన్ 10, 2024న, ఈ టమోటా ధర రూ. 37.11కి తగ్గింది. అంటే గత ఏడాది కాలంలో టమాటా ధర 81 శాతం అంటే కిలో రూ.16.56 పెరిగింది.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ధర
బిగ్ బాస్కెట్‌లో ఢిల్లీలో ఒక కిలో హైబ్రిడ్ టమోటా ధర రూ. 21. బంగాళదుంప ధర రూ.41, టమాటా కిలో రూ.38గా ఉంది. జెప్టోలో ఆలుగడ్డ కిలో రూ.44కు విక్రయిస్తున్నారు. కాగా ఉల్లి ధర కిలో రూ.43కి చేరింది. టమాటా ధర కిలో రూ.28 పలుకుతోంది. బ్లింకిట్‌లో ఉల్లి ధర కిలో రూ.47కి చేరింది. కాగా టమోటా ధర కిలో రూ.26. బంగాళదుంపలు కిలో 41 రూపాయలకు లభిస్తున్నాయి.

Read Also:Raju Yadav : ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కూరగాయల భోజనం ధర
ఇంట్లో తయారుచేసిన శాఖాహారం థాలీ సగటు ధర మేలో 9 శాతం (సంవత్సరానికి) పెరిగి రూ.27.8కి చేరుకుంది. గత మే నెలలో ఇదే థాలీ ధర రూ.25.5. ఏప్రిల్ 2024తో పోల్చినప్పుడు, ధర 1 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఒక్కో ప్లేటు రూ.27.4గా ఉంది. వెజ్ థాలీ ధరలు పెరగడానికి బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలే ప్రధాన కారణం.