Vegetable Prices : ఆకాశాన్నంటిన ఆలు, ఉల్లి, టమాటా ధరలు.. ఏడాదిలో 81 శాతం పెరుగుదల
- మండిపోతున్న ఆలు గడ్డ ఉల్లి టమాటా ధరలు
- గతేడాదితో పోలిస్తే 81శాతం పెరుగుదల
- వెజ్ థాలీ ధరలు పెరగడానికి ఇదే కారణం
- ఆందోళనలో సామాన్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetable Prices : దేశంలో కూరగాయల ధరలు భారీగా పెరిగనట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత 15 రోజుల్లో ఉల్లి టోకు ధరలు 50 శాతం వరకు పెరిగాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ డేటాను పరిశీలిస్తే.. గత ఏడాది కాలంలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు 81 శాతం వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు కూరగాయల సగటు ధరల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. గత ఏడాది కాలంలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టొమాటోల ధరల్లో ఎంత పెరుగుదల కనిపించిందో గణాంకాల ద్వారా తెలుసుకుందాం.
గత ఏడాదిగా పెరిగిన ఆలుగడ్డ ధర
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 30, 2023న బంగాళదుంప సగటు ధర కిలోకు రూ. 18.88. ఇది జూన్ 10, 2024 నాటికి కిలో రూ. 30.57కి చేరింది. అంటే బంగాళదుంప ధర కిలో రూ.11.69 పెరిగింది. అంటే గత ఏడాది కాలంలో బంగాళదుంపల ధరలు 62 శాతం పెరిగాయి. జూన్ నెలలో బంగాళదుంపల సగటు ధర కిలోగ్రాముకు ఒక రూపాయి పెరిగింది.
Also Read
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
ఏడాదిలో రూ.13.50కి పెరిగిన ఉల్లి ధర
గతేడాది నుంచి ఉల్లి ధరలు సామాన్యులను కంటతడి పెట్టిస్తున్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఏప్రిల్ 30, 2023న కిలో ఉల్లిపాయల సగటు ధర రూ. 20.41. జూన్ 10 నాటికి రూ.33.98కి పెరిగింది. అంటే గత ఏడాది కాలంలో ఉల్లి ధర 66 శాతం పెరిగింది అంటే కిలో రూ.13.57. జూన్ నెలలో ఉల్లి సగటు ధర కిలోకు రూ.1.86 పెరిగింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర రూ.12 పెరిగింది.
Read Also:Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
60శాతానికి పైగా పెరిగిన టమాటా ధర
బంగాళదుంపలు, ఉల్లిపాయలతో పోలిస్తే టమాటా ధర అత్యధికంగా పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 30, 2023న టమోటా రిటైల్ ధర కిలోకు రూ. 20.55. జూన్ 10, 2024న, ఈ టమోటా ధర రూ. 37.11కి తగ్గింది. అంటే గత ఏడాది కాలంలో టమాటా ధర 81 శాతం అంటే కిలో రూ.16.56 పెరిగింది.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ధర
బిగ్ బాస్కెట్‌లో ఢిల్లీలో ఒక కిలో హైబ్రిడ్ టమోటా ధర రూ. 21. బంగాళదుంప ధర రూ.41, టమాటా కిలో రూ.38గా ఉంది. జెప్టోలో ఆలుగడ్డ కిలో రూ.44కు విక్రయిస్తున్నారు. కాగా ఉల్లి ధర కిలో రూ.43కి చేరింది. టమాటా ధర కిలో రూ.28 పలుకుతోంది. బ్లింకిట్‌లో ఉల్లి ధర కిలో రూ.47కి చేరింది. కాగా టమోటా ధర కిలో రూ.26. బంగాళదుంపలు కిలో 41 రూపాయలకు లభిస్తున్నాయి.
Read Also:Raju Yadav : ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కూరగాయల భోజనం ధర
ఇంట్లో తయారుచేసిన శాఖాహారం థాలీ సగటు ధర మేలో 9 శాతం (సంవత్సరానికి) పెరిగి రూ.27.8కి చేరుకుంది. గత మే నెలలో ఇదే థాలీ ధర రూ.25.5. ఏప్రిల్ 2024తో పోల్చినప్పుడు, ధర 1 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఒక్కో ప్లేటు రూ.27.4గా ఉంది. వెజ్ థాలీ ధరలు పెరగడానికి బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలే ప్రధాన కారణం.
తాజావార్తలు
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!