NTV Telugu Site icon

Rajini: దివ్యాంగురాలు రజినీకి అగ్రికల్చర్ కార్పోరేషన్లో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం

Rajini

Rajini

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇచ్చాడు. రజినీకి ఉద్యోగం ఇస్తూ ఫైల్ పై సంతకం చేశారు. అంతేకాకుండా.. ప్రమాణస్వీకార వేదిక మీదనే రజినీకి నియామక పత్రాన్ని అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా.. దివ్యాంగురాలు రజినీకి అగ్రికల్చర్ కార్పోరేషన్ లో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం ఇచ్చారు. రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (TSSOCA) లో ప్రాజెక్ట్ మేనేజర్ గా రజినీకి పోస్టింగ్ ఇచ్చారు.

Read Also: Pawan Kalyan: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు..

ఎన్నికలకు ముందు గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిసిన రజినీ.. తన సమస్యను చెప్పుకుంది. పీజీ పూర్తి చేసినా కూడా అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదంటూ హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ.. గతంలో రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె బాధను అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వస్తారని చెప్పుకొచ్చారు. అదే రోజున, వాళ్ల ముందే.. అదే వేదిక మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం రజనీకే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Show comments