పది పాసైన వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ఇది మంచి అవకాశం.. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. 30 వేలకు పైగా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి పరీక్ష ఉండదని అధికారులు చెబుతున్నారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇండియన్ పోస్ట్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లు… గ్రామీణ డాక్ సేవకులు, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్,డాక్ సేవక్స్ పోస్టులపై ఉంటాయి.. ఈ పోస్టులకు దరఖాస్తులను ఈ నెల 23 లోపు అప్లై చేసుకోవాలి.. మీరు indiapostgdsonline.gov.in ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును నింపిన తర్వాత ఆగస్టు 24 నుంచి 26 వరకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇండియా పోస్ట్‌లో జరగబోయే ఈ రిక్రూట్‌మెంట్లన్నింటికీ, అభ్యర్థికి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి..
ఇకపోతే మొత్తం 30041 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్స్q పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ జరుగుతోంది . 18 నుంచి 40 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులు చదివి ఉండాలి. స్థానిక భాషా పరిజ్ఞానం ఉండాలి. ఫారమ్ నింపడానికి రుసుము రూ.100గా నిర్ణయించబడింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే ఈ ఫీజు ఉంటుంది. అభ్యర్థికి కంప్యూటర్ ఆపరేషన్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.. అలాగే సైకిల్ తొక్కడం కూడా తెలిసి ఉండాలి.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..