Site icon NTV Telugu

Postal Jobs : పోస్టల్ లో జాబ్స్..12,828 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Post Office

Post Office

భారత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ మధ్య ప్రభుత్వ సంస్థలకు సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా పోస్టల్ లో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ఎన్నికైన అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యింది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేయనున్నారు.. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు..

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా..తాజాగా మెరిట్ జాబితా రిలీజ్ అయ్యింది.. పదవ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను ఆదరణ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.. ఈ సెలెక్ట్ అయిన వారిని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి..

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.. ఈ మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు ఉండగా, తెలంగాణలో 96 ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు జూలై 17 లోగా డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేయించుకోవాలి.. ఆన్ లైన్ టెక్స్ట్ ను నిర్వహిస్తారు.. ఆ తర్వాత కంప్యూటర్ పరిజ్ఞానంను చెక్ చేస్తారు.. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదువి అప్లై చేసుకోగలరు..గతంలో విడుదల చేసిన దానికన్నా ఎక్కువగా ఈ ఏడాది ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారని సమాచారం..

Exit mobile version