పోస్టు మాస్టర్ ఇంటికి కన్నం వేశాడు…. ఓ అసిస్టెంట్ పోస్టు మాస్టర్. ప్రజలకు పంపిణి చేసే పెన్షన్ డబ్బులను కాజేశాడు. ఈజీ మనీ కోసం తన స్నేహితునితో కలిసి స్కెచ్ వేసి మరీ 8 లక్షల రూపాయలు కొట్టేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. రాష్ట్ర స్దాయిలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తపాల శాఖ ఉద్యోగితో పాటు అతని స్నేహితున్ని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిల్లికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నరేందర్ ఇంట్లో గత నెల 29న చోరీ జరిగింది. ఈ కేసును మాక్లూర్ పోలీసులు చేధించారు. దొంగతనం చేసిన కేసులో పోస్టల్ ఉద్యోగి సహా అతని స్నేహితున్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Rashmika Mandanna: ప్లాప్ వచ్చినా రష్మికను నార్త్ బెల్ట్ వదులుకోలేకపోతుందా..?
నరేందర్ ఇంట్లో డబ్బులు కాజేసేందుకు.. నిందితులు వేసిన స్కెచ్‌కు పోలీసులే అవాక్కయ్యారు. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన నరేందర్.. స్థానిక పోస్ట్ ఆఫీస్‌లో బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు పంచేందుకు హెడ్ పోస్టాఫీస్ నుంచి 8 లక్షల రూపాయల నగదు తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఆ డబ్బులు లబ్దిదారులకు పంపిణీ చేయాలని రాత్రి తన ఇంట్లో పెట్టుకున్నాడు. పెన్షన్ డబ్బులు నరేందర్ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న.. సహా ఉద్యోగి ముబారక్ నగర్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ సాయి కుమార్ ఆ డబ్బులను చోరీ చేయాలని స్కెచ్ వేశాడు.
అనుకుందే తడవుగా.. నవీపేట మండలం నాగేపూర్‌కి చెందిన తన స్నేహితుడు రాకేష్‌ను రంగంలోకి దింపాడు. అదే రోజు రాత్రి నరేందర్ ఇంటి కెళ్లి.. తాను ఓ రైతును రాత్రి పడుకునేందుకు ఆశ్రయం కల్పించాలని కోరి.. పోస్ట్ మాస్టర్ ఇంట్లో బస చేశాడు. నరేందర్ అతని కుటుంబ సభ్యులు గాడ నిద్రలోకి జారుకున్నాక.. డబ్బుల బ్యాగ్‌తో ఉడాయించాడు. తెల్లారి చూసే సరికి.. ఆశ్రయం పొందిన వ్యక్తితో పాటు బ్యాగ్ లేకపోవడంతో పోస్ట్ మాస్టర్ షాక్‌కు గురై.. మాక్లూర్ పోలీసులను ఆశ్రయించాడు.
బ్రాంచి పోస్టు మాస్టర్ నరేందర్ ఇంట్లో చోరీ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. చోరీ డబ్బులు పెన్షన్ సొత్తు కావడంతో.. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. దొంగతనంలో ముబారక్ నగర్ పోస్టాఫీస్ అసిస్టెంట్ పోస్టు మాస్టర్.. నాగేపూర్‌కు చెందిన సాయికుమార్ ఆ డబ్బులను దొంగిలించాలని తన స్నేహితుడు రాకేష్ తో కలిసి పథకం రచించి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్ని సాంకేతిక ఆధారాలతో కేసును చేధించారు.
Also Read:China K Visa: అమెరికా తలబిరుసు తనం.. చైనా సరికొత్త ఆహ్వానం..
బ్రాంచ్ మాస్టర్ ఇంట్లో ఎత్తుకెళ్లిన సొత్తును అసిస్టెంట్ పోస్టు మాస్టర్‌కు ఇవ్వగా… అతను ఆ నగదు రహస్య ప్రాంతంలో దాచాడు. సాయి కుమార్ మూడు సంవత్సరాలుగా ముబారక్ నగర్ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. తన ఉద్యోగరిత్యా ప్రతీ పోస్టు ఆఫీస్‌కి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎప్పుడు తీసుకొస్తారు. వాటిని ఎక్కడ ఉంచుతారనే సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలో సాయి కుమార్ పెన్షన్ డబ్బులు కాజేయాలనే ఆలోచన కలిగింది అంటున్నారు పోలీసులు. ఈజీ మనీ కోసం.. అత్యాశతో అసిస్టెంట్ పోస్టు మాస్టర్ .. బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఇంట్లో చోరీకి ప్లాన్ వేసి.. సక్సెస్ అయ్యాడు. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుట్టు రట్టు చేశారు. ఉద్యోగం చేసుకోవాల్సిన అసిస్టెంట్ పోస్టు మాస్టర్ తప్పు చేసి.. ఇప్పుడు.. కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.
