NTV Telugu Site icon

Post Office Jobs: పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం.. పోస్టాఫీసుల్లో 40 వేలకు పైగా కొలువులు

Postal Jobs

Postal Jobs

Post Office Jobs: పదోతరగతి పాసైన నిరుద్యోలకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ శుభవార్త తెలిపింది. కేంద్ర తపాలా శాఖ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చింది. పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.

ఏ పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్ పోస్ట్‌ మాస్టర్‌, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్‌ మాస్టర్, డాక్ సేవక్‌ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కేవలం పదోతరగతి అర్హతపైనే పరీక్ష నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు సవరించుకునేందుకు అవకాశం కూడా కల్పించింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారు 18-40 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. కంప్యూటర్‌పై అవగాహనతో పాటు సైకిల్ తొక్కడం కూడా రావాలి. కాగా, మొత్తం 40, 889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1260 ఖాళీలు ఉన్నాయని కేంద్ర తపాలా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది.

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్‌ మాస్టర్‌, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్‌ మాస్టర్, డాక్ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్ట్‌ను బట్టి ప్రారంభ వేతనం రూ.10,000-12,000 వేరకు ప్రారంభ వేతనం అందుకోవచ్చు. అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) ఉద్యోగాలకు రూ.12 వేల నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) లేదా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగానికి రూ.10 వేల నుంచి రూ.24,470 మధ్య వేతనం చెల్లిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు మాత్రం రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ ఆధారపడి ఉంటుంది. పదో తరగతి పాస్ కావడంతోపాటు అందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదవాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27/01/2023

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16/02/2023

దరఖాస్తు సవరణలకు అవకాశం: ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు