Post Office : ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. వడ్డీ రేట్ల మార్పు పోస్టాఫీసులోని అన్ని పథకాలపై కూడా ప్రభావం చూపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి మాత్రమే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.5 శాతానికి పెరిగింది. కొత్త వడ్డీ రేటు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. గతంలో ఈ పథకంపై కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే అందేది.
Read Also: Pm Narendramodi Tour Live: మోడీ టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్
=పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాలో వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఇందులో కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఒక పెట్టుబడిదారుడు 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే ఐదేళ్లలో రూ.2.25 లక్షల వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ కాలిక్యులేటర్ ప్రకారం, రూ. 5 లక్షల మొత్తం పెట్టుబడిపై 5 సంవత్సరాలలో ప్రస్తుత రేటు (7.5 శాతం) ప్రకారం మొత్తం రూ. 2 లక్షల 24 వేల 974 వడ్డీగా అందుతుంది.
Read Also:AP IPS Transfers: ఏపీలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు
మొదటి 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌కి 7% వడ్డీ లభిస్తుంది. ఈ రేటు ప్రకారం ఐదేళ్లలో వడ్డీ మొత్తం 2 లక్షల 7 వేల రూపాయలు. వడ్డీ రేటు పెంపు తర్వాత ఇప్పుడు దాదాపు 18 వేల రూపాయలు అదనంగా లభించనున్నాయి. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాల్లో ఏడాది నుంచి ఐదేళ్ల పరిమితికి ఖాతాలను తెరవవచ్చు. వీటిపై వడ్డీ రేటు 6.8 శాతం, 6.9 శాతం, 7 శాతం, 7.5 శాతానికి పెరిగింది. వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లించబడుతుంది.