NTV Telugu Site icon

Post office Scheme :సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే..రూ.7 లక్షలకు పైగా రాబడి..

Post Office

Post Office

ఈరోజుల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పడం కష్టమే అందుకే జనాలు తాము సంపాదించే కొంతభాగం పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఇందులో భాగంగా సెక్యూరిటీతో పాటు, మంచి వడ్డీ రావాలని కోరుకుంటారు.. ఇలాంటి వారికోసమే పోస్టాఫీసులో అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.. ఆ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా సేవింగ్స్‌పై 7.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ క్రమంలోనే గత ఏప్రిలోలో వడ్డీ రేట్లలో మార్పులు జరిగాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం సవరిస్తుంటుంది.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి 7.5 శాతం వడ్డీ వస్తుంది.. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, 5 ఏళ్లు పాటు డబ్బును డిపాజిట్‌ చేయవచ్చు. ఒక ఏడాదిపాటు పెట్టుబడి పెడితే 6.9 శాతం వడ్డీ పొందొచ్చు. లేదా 2 నుంచి మూడేళ్లు పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ పొందొచ్చు. ఇకపోతే ఒకవేళ 5 ఏళ్లు పెట్టుడితే గరిష్టంగా 7.5 శాతం వడ్డీని పొందొచ్చు..

ఉదాహరణకు ఈ పథకంలో ఓ వ్యక్తి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుంటే. అతనికి ఆ మొత్తంపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. మెచ్యూరిటీ వరకు ఉంచితే డిపాజిట్‌పై రూ. 2,24,974 వడ్డీని పొందొచ్చు.. అతనికి వడ్డీ మొత్తం కలిపి అతనికి రూ. 7,24,974కి చేరుతుంది. ఇక ఈ స్కీమ్‌ ద్వారా ఆదాయపు పన్ను శాఖ చట్టం 1961లోని సెక్షన్‌ 80సీ కింద కస్టమర్లు పన్ను మినహాయింపు పొందొచ్చు.. ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. ఈ ఖాతాలో రూ. 1000 నుంచి ఖాతాను తెరవొచ్చు..

Show comments