Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్.. పాన్ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Post Office New Rules 2026: పోస్టాఫీసు లావాదేవీలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం, ఇకపై డిపాజిట్ చేయడం లేదా డబ్బు విత్‌డ్రా చేసుకోవడం వంటి ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ మేరకు ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, పోస్టాఫీసు ఖాతా ఉన్నా లేకపోయినా, లేదా ఏదైనా పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టినా, ప్రతి లావాదేవీకి పాన్ నంబర్ సమర్పించడం తప్పనిసరి. అలాగే India Post Payments Bank సేవలను వినియోగించే వారు కూడా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఆర్థిక లావాదేవీలు మరింత పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం పన్ను ఎగవేతను తగ్గించడం, అధిక విలువ గల లావాదేవీలను పర్యవేక్షించడం, మరియు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచడం. ఆదాయపు పన్ను నిబంధనలు 2026లోని వివిధ నియమాల పరిధిలో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. అయితే, పాన్ కార్డు లేని వారికి కూడా ఒక ప్రత్యామ్నాయం కల్పించారు. అలాంటి వారు ఇప్పటి వరకు ఉపయోగించిన ఫారం 60కు బదులుగా ఫారం 97ను సమర్పించాలి. ఈ ఫారంలో వ్యక్తిగత వివరాలు, లావాదేవీ సమాచారం మరియు అవసరమైన పత్రాలు తప్పనిసరిగా ఇవ్వాలి. పాన్ లేకుండా జరిగే లావాదేవీలను కూడా సరైన విధంగా నమోదు చేయడానికి ఈ చర్యలు తీసుకున్నారు.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఇక మరో ముఖ్యమైన మార్పు ఫారం 15G, 15Hలకు సంబంధించినది. ఇప్పటివరకు వడ్డీపై టీడీఎస్ మినహాయింపుకు వేర్వేరు ఫారాలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని ఒకే ఫారం 121గా ఏకీకృతం చేశారు. ఈ ఫారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే మొత్తం పన్ను విధించదగిన ఆదాయం సున్నా ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. మొత్తంగా, పోస్టాఫీసు లావాదేవీలలో ఈ కొత్త నిబంధనలు ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. ఖాతాదారులు ఈ మార్పులను గమనించి, అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!