NTV Telugu Site icon

Parenting Tips: పిల్లలతో ఇలా ఉంటే చిన్నప్పటి నుండే సక్రమ మార్గంలో పయనిస్తారు

Parenting Tips

Parenting Tips

Parenting Tips: పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమయమైన అనుభవం. అయితే, పిల్లల పుట్టిన తరువాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే, మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, క్రమశిక్షణ మిళితమైన దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారిని పూర్తి స్వతంత్రంగా, మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

Also Read: Chayote Health Benefits: సీమ వంకాయ గురించి విన్నారా.. తింటే ఇన్ని లాభాలా?

పిల్లల్ని ప్రోత్సహించండి:

మీ పిల్లలని ప్రోత్సహించడం పాజిటివ్ పేరెంటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలు ఏ పని సరైన విధంగా చేసేటప్పుడు వారిని మెచ్చుకోవడం, చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం ద్వారా వారిలో విశ్వాసం పెరుగుతుంది. ఇది వారిని మరింత కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది.

పిల్లలతో సమయం గడపండి:

ఈ వేగవంతమైన జీవితంలో పని, ఇళ్ల పనుల్లో నిమగ్నమై పిల్లలతో సరైన సమయం గడపలేకపోవడం సాధారణమైంది. కానీ, ఇది పిల్లల పెంపకంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. వారితో ప్రతిరోజూ లేదా వారంలో కనీసం ఒక రోజు సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన చోటు తీసుకెళ్లడం, సినిమాలు చూడడం లేదా పార్క్‌కు తీసుకెళ్లడం ద్వారా మీరు వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచవచ్చు.

Also Read: Air Travel: విమాన ప్రయాణికులకు అలర్ట్.. లగేజ్ బరువు, పరిమితిపై కొత్త నిబంధనలు..

మంచి, చెడుల గురించి వివరించండి:

పిల్లలకు ఏదైనా కొత్త విషయాలు చెప్పేటప్పుడు మంచి, చెడుల గురించి వివరించడం చాలా అవసరం. ఇది వారికి సమాజం గురించి అవగాహన పెంచి, సరైన నిర్ణయాలు తీసుకునే గుణాన్ని కల్పిస్తుంది.

పిల్లలకు స్వతంత్రత ఇవ్వండి:

వయసుకు తగ్గట్టుగా పిల్లలకు స్వతంత్రతను ఇవ్వడం ద్వారా వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యతలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి మంచి, చెడుల గురించి వివరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది.