Site icon NTV Telugu

Posani Krishna Murali: జగన్‌ను చంపేందుకు కుట్ర..! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తా..

Posani

Posani

Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రాణహాని ఉంది.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినా పట్టించుకునేవాడే లేడని ఫైర్‌ అయ్యారు పోసాని కృష్ణమురళి.. అయితే, వైఎస్‌ జగన్‌కు ప్రాణహానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) చంద్రచూడ్ కు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కి ఒక రోజు రండి.. తిరిగి చూడండి.. వైఎస్‌ జగన్ ను కాపాడండి అని లేఖలో సీజేఐను కోరనున్నట్టు వెల్లడించారు పోసాని.. వైఎస్‌ జగన్‌ను కాపాడండి అని సీజేఐకి రాసే లేఖలో విజ్ఞప్తి చేస్తాఅన్నారు. ఇక, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు పెట్టుకుని ఏదైనా చేస్తా అన్నట్టుగా చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు.. భారత్ దేశంలో నెంబర్ వన్ డాన్ చంద్రబాబుగా పేర్కొన్న ఆయన.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు.. ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు.. ఈ యుగంలో చంద్రబాబు రాక్షసుడు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.

Read Also: Bomb Threat : నిన్న ట్వీట్.. నేడు పాఠశాలల్లో బాంబులు.. బీజేపీ నాయకుడి పోస్ట్‌పై ఆప్ ప్రశ్నలు

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. బీజేపీలో చేరితే.. ఎవరు ఏం చేసినా నడుస్తుందా? చేసిన అవినీతి కూడా కనిపించదా? అని నిలదీశారు పోసాని కృష్ణమురళి.. ఫేక్‌ వీడియోపై వెంటనే స్పందించిన కేసులు పెడుతున్నారు.. మరి బహిరంగంగా.. సీఎం వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదు.. చంద్రబాబు కామెంట్లను రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఇతర నేతలు ఎవరూ వినలేదా? ఈ ఘటనపై అసలు చర్యలు తీసుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి. ఇక, మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణ మురళి చేసిన సంచలన ఆరోపణల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version