Site icon NTV Telugu

Boby Dog: ఇది మామూలు కుక్క కాదు.. గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కింది

Bobby

Bobby

Boby Dog: ఈ కుక్క పేరు బాబీ. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న కుక్క. దీని వయసు ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోవాల్సిందే. దీని వయసు అక్షరాలా 30ఏళ్ల 266 రోజులు. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అసలు కుక్కలు మా అంటే 10 ఏళ్లు లేదంటే కొన్నైతే 15 ఏళ్ల వరకు బతుకుతాయి. అంతకుమించి అవి బతకలేవు. కానీ.. ఈ కుక్క ఏకంగా 30 ఏళ్లు దాటినా ఇంకా ధృడంగా ఉంది. అత్యంత ఎక్కువ వయసుతో ఉండి బతికి ఉన్న కుక్కగా మరో రికార్డు కూడా ఇది క్రియేట్ చేసింది.

Read Also: Millets: గుడిసెలో నివసించే మహిళ.. ఇప్పుడు మిల్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్

ఇదివరకు ఈ రికార్డు బ్లూయే అనే కుక్క పేరు మీద ఉండేది. ఆ కుక్క 1910లో పుట్టి 1939లో చనిపోయింది. అంటే ఆ కుక్క 29 ఏళ్లు మాత్రమే బతికింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసి 30 ఏళ్ల బతికి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది బాబీ. దీని పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించి దానికి సర్టిఫికెట్ కూడా అందించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.

Read Also: Fire In Mumbai : ముంబైలో భారీ అగ్నిప్రమాదం, అదుపులోకి రాని మంటలు

బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్‌ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్‌ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లున్నప్పుడు బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు.

Exit mobile version