Site icon NTV Telugu

Porsche Cayenne: ఈ కారు ధరకు నగరాలలో విలాసవంతమైన ఇంటిని కొనవచ్చుగా.. కొత్త పోర్ష్‌ కయెన్ బ్లాక్ వర్షెన్ రిలీజ్.!

Porsche Cayenne Black

Porsche Cayenne Black

Porsche Cayenne: ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ బ్రాండ్ పోర్ష్‌ కంపెనీ భారత మార్కెట్‌లో మరోసారి తన హవాను కొనసాగించేందుకు మాస్టర్ ప్లాన్ చేసింది. ఈసారి కంపెనీ తన ప్రసిద్ధ SUV మోడల్స్ అయిన Cayenne, Cayenne Coupe లకు ప్రత్యేకమైన బ్లాక్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. విభిన్నమైన డిజైన్, కొత్త రంగులు, ఆల్ బ్లాక్ థీమ్ ఇంకా సాంకేతికంగా రిచ్ ఫీచర్లతో ఈ వెర్షన్లు అత్యంత స్టైలిష్, ప్రీమియంగా నిలుస్తున్నాయి.

ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్లకు ప్రధాన ఆకర్షణ ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్ డిజైన్. వాటిలో బ్లాక్ హెడ్లైట్స్, బ్లాక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMs), బ్లాక్ బ్యాడ్జులు, సైడ్ విండో ట్రిమ్, డార్క్ బ్రొన్జ్ ఫినిష్ ఉన్న ఎగ్జాస్ట్ టిప్స్, 21-ఇంచ్ RS స్పైడర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతేకాకుండా, LED పడ్డిల్ లైట్లు కూడా ఉన్నాయి. ఈ మోడల్స్‌కు ప్రత్యేకంగా క్రోమైట్ బ్లాక్ మెటాలిక్ అనే పేయింట్ షేడ్‌ను అందిస్తున్నారు. అంతేకాకుండా కాకుండా, ఇతర రంగులలోనూ ఈ కార్లు లభించనున్నాయి. అందులో తెలుగుపు, కర్రారా వైట్ మెటాలిక్, డోలమైట్ సిల్వర్ మెటాలిక్, క్వార్ట్జైట్ గ్రే మెటాలిక్, కార్మైన్ రెడ్, కాష్మీర్ బీజ్ మెటాలిక్ వేరియంట్లు ఉన్నాయి. రంగును బట్టి ఈ పెయింట్ ఆప్షన్ల ధరలు 7.30 లక్షల నుంచి 20.13 లక్షల వరకు ఉంటాయి.

S*ex Scandal: థాయ్‌లాండ్‌ని కుదిపేస్తున్న బౌద్ధ సన్యాసుల సె*క్స్ కుంభకోణం..

అంతేకాకుండా ఈ కార్ల ఇంటీరియర్ కూడా బ్లాక్ థీమ్‌ లోనే డిజైన్ చేయబడింది. ఇందులో బ్లాక్ లెదర్ సీట్స్, బ్రష్డ్ అల్యూమినియం ట్రిమ్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ల్స్, పవర్ ఫ్రంట్ సీట్లు, పానొరామిక్ సన్‌రూఫ్, బోస్ 710W 14 స్పీకర్ సౌండ్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ స్టాండర్డ్ Cayenne వేరియంట్లలోనూ ఉన్నప్పటికీ.. బ్లాక్ ఎడిషన్ లో అవి మరింత రిఫైన్డ్‌ లుక్‌తో కనిపిస్తాయి.

Instagram Auto Scroll: ఇక రీల్స్ స్వైప్ చేయాల్సిన అక్కర్లే.. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రీల్ చూసేయ్యండి!

ఇక కారు పవర్‌ట్రైన్ విషయానికి వస్తే.. ఈ బ్లాక్ ఎడిషన్ వేరియంట్లు ఇదివరకు మోడల్స్‌కి సమానమైన 3.0 లీటర్ V6 టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఇది 353 హార్స్‌పవర్ శక్తి, 500 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ అమర్చారు. డ్రైవింగ్ పెర్ఫార్మన్స్ పరంగా ఇది ముందటి వేరియంట్లతో సమానంగా ఉన్నా.. కొత్త డిజైన్ ద్వారా కారు ప్రొఫైల్‌కు స్టైలిష్ లుక్ కలుగుతుంది.

Exit mobile version