NTV Telugu Site icon

Pope francis: జీ 7 నాయకుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న పోప్ ఫ్రాన్సిస్

Popo

Popo

పోప్ ఫ్రాన్సిస్‌కు అరుదైన అవకాశం దక్కింది. జీ 7 నాయకులను ఉద్దేశించి ప్రసంగించే ఛాన్స్ దక్కింది. జీ 7 సదస్సులో మాట్లాడే మొదటి కాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఫ్రాన్సిస్ నిలుస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం కృత్రిమ మేధస్సుకు సంబంధించి జీ7 నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాంకేతికతతో కలిగే నష్టాలను.. ప్రయోజనాలను గురించి మాట్లాడనున్నారు.

ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేదు..ఇంటి నుంచే పనిచేసిన మాజీ సీఎం

రెండ్రోజుల్లో ఇటలీలో జీ 7 సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు హాజరుకానున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితుడిగా భారత్ ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు.

రెండ్రోజుల పాటు మోడీ ఇటలీలో పర్యటించనున్నారు. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, అబుధాబి రాజు షేక్‌ మోహమ్మద్‌ బిన్‌ జాయద్‌, మరి కొందరు అరబ్‌ రాజకుటుంబీకులను మోడీ కలుసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: NEET Result 2024: ముదిరిన నీట్ ఫలితాల వివాదం.. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్.. నీట్ లో 705 మార్కులు

మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ప్రపంచ దేశాధినేతలందరూ శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉండడంతో.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రాబోయే త్వరలోనే జరిగే బిమ్స్‌టెక్‌, జీ-20, ఆసియన్‌- ఈస్ట్‌ ఆసియా సదస్సులకు కూడా మోడీ హాజరు కానున్నారు.

ఇది కూడా చదవండి: G.O 317 : జీవో 317 పై కేబినేట్‌ సబ్ కమిటీ భేటీ