Site icon NTV Telugu

Pope Francis: జీ7 సదస్సులో పోప్ కీలక వ్యాఖ్యలు

Kdke

Kdke

ఇటలీలో జీ 7 సదస్సు ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఒక దగ్గరకు చేరడంతో సమ్మిట్ అంతా ఉల్లాసంగా నడుస్తోంది. ఒక ఆహ్వాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది. ఇక ఇటలీ ప్రధాని మెలోని అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇక ప్రధాని మోడీ.. అగ్ర నేతలందరితో కలిసి సంభాషిస్తున్నారు.

ఇదిలా ఉంటే పోస్ ఫ్రాన్సిస్.. జీ 7 సదస్సునుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ వంటి శక్తిమంతమైన సాంకేతికత.. మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని పోప్‌ ఫ్రాన్సిస్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏఐని సద్వినియోగం చేసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. చాట్‌జీపీటీ వంటి రూపాల్లో కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. దాని ప్రయోజనాలు, పొంచిఉన్న ముప్పుల గురించి మాట్లాడిన ఆయన.. జీ7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోప్‌గా చరిత్రకెక్కారు.

ఇదిలా ఉంటే G7 సమ్మిట్‌లో భాగంగా అవుట్‌రీచ్ సెషన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోస్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంతేకాకుండా కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

Exit mobile version