Site icon NTV Telugu

Poonam Kaur : నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తా‌వా.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ ‘ఇది సమంతకే‌నా?’

Ssamantha Raj, Punam Cour

Ssamantha Raj, Punam Cour

హీరోయిన్‌గా పెద్దగా విజయాలు సాధించకపోయినా, సోషల్ మీడియాలో తన విమర్శాత్మక వ్యాఖ్యలతో తరచూ హాట్‌టాపిక్‌గా మారుతుంది పూనమ్ కౌర్. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఏదో ఓ ట్వీట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మళ్లీ ఒక ట్వీట్‌తో సంచలనం రేపింది. ఆమె షేర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారి తీసాయి. “నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా. ఇది బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత గల మనిషి. డబ్బు ఉంటే బలహీనమైన, ఆశపడే పురుషులు చాలా మంది వస్తారు” అని రాసింది. ఈ ట్వీట్‌లో ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా, దాని టైమింగ్, పరోక్ష సూచనల వల్ల పూనమ్ సమంత రూత్ ప్రభుని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిందనే అభిప్రాయం నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Tamannaah : మరో పవర్‍ఫుల్ రోల్‌లో తమన్నా..

డిసెంబర్ 1న సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజ్ నిడిమోరు‌కు ఇది వరకే పెళ్లి జరిగింది, పిల్లలు కూడా ఉన్నారు. సమంతతో సంబంధం మొదలైన తర్వాత తన మొదటి భార్య శ్యామలాదేవి‌కి విడాకులు ఇచ్చారన్న వార్తల మధ్యలో పూనమ్ ఈ ట్వీట్ రావడంతో, సోషల్ మీడియాలో మరోసారి చర్చలు రాజుకున్నాయి. దీంతో కొంత మంది నెటిజన్లు, “సమంత పెళ్లి కోసం మరొక కుటుంబం పాడైందా?”, “శ్యామలాదేవి పరిస్థితి ఏమైంది?”అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై సమంత లేదా ఆమె టీమ్ స్పందిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిన ప్రతి సారి లాగే, ఈసారి కూడా ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చను రేపాయి.

Exit mobile version