బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27 న విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను తమిళ్ మూవీ మండేలా సినిమాకు రీమేక్ గా నూతన దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కించారు.ఈ చిత్రంలో వి.కె.నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఓటు విలువ గురించి తెలియజేస్తూ సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులకు నూతన దర్శకురాలు పూజ కొల్లూరు ఓ అభ్యర్థన చేశారు. ఓటు హక్కు గొప్పతనాన్ని తెలియజేస్తూ తాను తీర్చిదిద్దిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రాన్ని వీక్షించాలని ఆమె కోరారు.సినిమా చూసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని అన్నారు.
”ఐఏఎస్ కావాలని కలలు కన్న నేను ఫిల్మ్‌మేకర్‌గా మారి.. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాను.. ఇది పొలిటికల్ సినిమా కాదు. ప్రజల సినిమా. మీలాంటి గొప్ప నాయకులను చూసి నేను ఎంతగానో ప్రేరణ పొందాను. మా సంక్షేమానికి సంబంధించిన పనుల్లో మీరెంతగానో బిజీగా ఉన్నారని నాకు తెలుసు. రాజకీయ నాయకులు అలాగే సామాన్యులు తప్పకుండా వీక్షించాల్సిన సినిమా ఇది. దయచేసి మా చిత్రాన్ని వీక్షించి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నా..”బ్యాట్స్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ వంటి కథలను ఆధారంగా చేసుకుని పలు రీమేక్స్ చేస్తున్న ఈ సమయంలో సామాన్యుడికి సంబంధించిన కథను రీమేక్ చేస్తే తప్పేంటని ఆమె తెలియజేసారు.విడుదలకు ముందు వైజాగ్, విజయవాడ, వరంగల్, కర్నూలు మరియు నెల్లూరు వంటి ప్రాంతాల్లో ‘మార్టిన్ లూథర్ కింగ్’ ప్రీమియర్స్ వేసి దాదాపు 1200 మందికి సినిమాను చూపించాం. ఇదొక రీమేక్ సినిమా అని ఎవరూ కూడా అనుకోలేదు. ‘మండేలా’ ఒరిజినల్ కథపై నాకెంతో గౌరవం ఉంది. తమ చిత్రాన్ని వివిధ భాషాల్లో రీమేక్ చేస్తున్నందుకు చిత్రబృందం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది” అని ఆమె ట్వీట్స్ చేశారు.