టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఒక్క సినిమా కూడా మంచి టాక్ ను ఇవ్వలేకపోయింది.. మళ్లీ ఐరన్ లెగ్ హీరోయిన్ గా టాక్ ను అందుకుంది. గత ఏడాది ఒక్క హిట్ సినిమా లేకున్నా కూడా వరుస సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.. అయితే ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..
సినిమాలు ఉన్నా లేకున్నా పూజా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పెళ్లి కాకముందే తల్లి అవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది విన్న ఆమె ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.. ఈ విషయంలో ఆమె తల్లి దండ్రులు కూడా సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది.
పాపకు ముందే తల్లి కావాలి అనే నిర్ణయం తీసుకోవడం నిజమే కానీ అది రియల్ లైఫ్ లో కాదు తెరపై. ఎస్ ఫైనల్లీ ఇదే న్యూస్ పై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్లారిటీ వచ్చింది.. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేని ఈ అమ్మడుకు ఓ డైరెక్టర్ అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓ సినిమాలో తల్లి పాత్ర చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.. ఒక హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ లో కనిపిస్తే భారీ రెమ్యూనరేషన్ ఇస్తానని అనడంతో దానికి వెంటనే ఓకే చెప్పిందట పూజ. అంతేకాకుండా ఇప్పటివరకు ఆ డైరెక్టర్ అసలు ఫ్లాప్ అనేదే చూడలేదట.. అతని సినిమాతో అయిన హిట్ పడుతుందేమో చూడాలి… ఏది ఏమైనా పెళ్లి కూడా అవ్వలేదు ఇప్పుడు ఇలాంటి పాత్రలు చెయ్యడమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.