NTV Telugu Site icon

Ponnavolu Sudhakar Reddy: చంద్రబాబుపై సీఐడీ లాయర్‌ సంచలన వ్యాఖ్యలు..

Cid

Cid

Ponnavolu Sudhakar Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై ఈ రోజు ఏసీబీ కోర్టులో సీఐడీ లాయర్‌గా వాదనలు వినిపించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. స్కిల్‌ స్కామ్‌ ద్వారా రూ.371 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని.. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి GST ఇంటిలిజెన్స్ విజిల్ బ్లోయర్ పంపింది.. ఇది టాక్స్ పేయర్స్ మనీ.. ప్రజలకు వాడాల్సిన మనీ దోపిడీకి గురైందన్నారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, సునీత, పీవీ రమేష్ ల విచారణలో స్పష్టంగా తేలిందన్న ఆయన.. సీమెన్స్ కంపెనీ ఉచితంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తున్నట్టు జీవో ప్రకారం ఉంది.. ఎంవోయూలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 371 కోట్లు పేర్కొన్నారని.. 371 కోట్ల బీఆర్వో ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రెటరీపై ఒత్తిడి చేశారు.. అప్పటి సీఎం చంద్రబాబు హుకుం జారీ చేయడంతో రిలీజ్ చేసామని నోట్ ఫైల్స్ లో రాసి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐవైఆర్, పివి రమేష్ ల విచారణలో కూడా అప్పటి సీఎం చంద్రబాబు చెప్పడంతో చేసామని చెప్పారన్నారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. ఇక, టీడీపీ వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక వకీల్ ను తీసుకొచ్చి మరీ పోరాడారు.. ఎవరు ఎంత పొడుగయినా.. చట్టం వారికంటే పొడుగు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మందులు, ఇంటి ఆహారం ఇవ్వాలని పిటిషన్ వేశారు.. ప్రభుత్వం ఎలాంటి అడ్డంకి చెప్పకుండా కోర్టు నిర్ణయించాలని కోరిందన్నారు. వార్డు మొత్తం శానిటైజ్ చేశారు, ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు.. చంద్రబాబు అనుమతి లేనిదే ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లలేరు.. చంద్రబాబుకు చాలా మానవతా ధృక్పదంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. హౌస్ రిమాండ్ కోసం వేసిన పిటిషన్ పై చాలా వాదోపవాదాలు జరిగాయి.. ఎన్.ఎస్.జి కంటే ఎక్కువ సెక్యూరిటీ ఇప్పుడు ఇస్తున్నాం అన్నారు. జ్యుడీషియల్ కష్టడీకి వెళ్ళాక ఒక బంగ్లాలో పెట్టాలని కోరడం సరైనది కాదన్న ఆయన.. సెక్యూరిటీ ఏం కల్పించాలో జైల్ మాన్యువల్ లో ఉందన్నారు.

నిజంగా ప్రభుత్వం తరఫున హాని ఉంటే ఆయన ఎలా వందల కిలోమీటర్లు తిరిగారు.. జీఎస్‌వో ఇవ్వడం రాజకీయ నాయకుడికి ఒక దర్జా అని చెప్పుకొచ్చారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. రేపు మధ్యాహ్నం కానీ.. ఎల్లుండి కానీ మేం వేసిన కస్టడీ పిటిషన్ విచారణకు వస్తుందని తెలిపారు. గౌతం నవాల్ఖా జడ్జిమెంట్ లో జ్యుడీషియల్ కష్టడీ, పోలీస్ కష్టడీ ఉంది.. నాలుగేళ్ల తరువాత ఆరోగ్యం చెడిపోయాక ఒక డిటెన్యూ కోసం ఇచ్చిన జడ్జిమెంట్ గౌతం నవాల్ఖా .. ఆ కేసుకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెల్త్, వయస్సు, గతంలో కేసులు, హాని కలిగించే అంశాలు ఉంటే గౌతం నవాల్ఖా జడ్జిమెంట్ ఉంటుందని.. చంద్రబాబు అత్యంత ఆరోగ్యవంతుడు అని రెండు సార్లు చేసిన పరీక్షలలో వచ్చిందని పేర్కొన్నారు. అతి సురక్షితమైన జైలు రాజమండ్రి జైలు.. మొత్తం ప్రత్యేక ఏర్పాట్లు చేసాం.. జైళ్ళశాఖ డిజి ఏ చర్యలు తీసుకున్నారో క్లారిటీ ఇచ్చారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.