NTV Telugu Site icon

Ponnam Prabhakar : మన అందరికీ చాకలి ఐలమ్మ స్ఫూర్తి ..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

రవీంద్ర భారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ కోదండరాం, బస్వరాజు సారయ్య, బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్, బీసీ కమిషన్ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి, చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు.. అది జీవో రూపంలో కేబినెట్‌ ఆమోదించిందన్నారు. యూనివర్సిటీ పేరుకు పెడితే తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు.. యూనివర్సిటీకి పేరు పెట్టినందుకా…? వారి మనవరాలు శ్వేతమ్మకు మహిళా కమిషన్ సభ్యురాలు ఇచ్చినందుకా…? అని ఆయన ప్రశ్నించారు. జాతి ఐక్యత ప్రభుత్వానికి తెలియాలి అంటే రవీంద్ర భారతి దద్దరిల్లాలన్నారు. రాబోయే సంవత్సరం కార్యక్రమం తీసుకోవాలని, 10 సంవత్సరాలుగా బీసీల కోసం ఎందుకు పోలేదు… ఈరోజు చెన్నైకి ఎందుకు పోయారు.. ఫంక్షన్ లకి పోయారా అని ఆయన అన్నారు.

Ram Charan: ‘దేవర’కి చరణ్ విషెష్

అంతేకాకుండా..’పార్లమెంట్ లో కుల గణన తీర్మానం చేసి పెడతం. తెలంగాణలో కుల గణన కోసం తీర్మానం చేసి నిధులు మంజూరు చేసుకున్నాం. బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. చెన్నై పోతున్న brs నేతలు 10 సంవత్సరాలు ఏం చేశారు.. రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడతాం.. బలహీన వర్గాలకు సంబంధించి మనం తిన్న తినకపోయినా మన పిల్లలను చదివించాలి. మన కుల వృత్తులు మోడరేషన్ అయినాయి.. పిల్లలు మంచిగా చదివితేనే మన జాతికి భవిష్యత్.. చదువు విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయద్దు.. ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం జరిగితే అణచివేయబడ్డారు.. మొన్నటి చరిత్రలో నీళ్ళు నిధులు నియామకాలు కోసం అనేక పోరాటాలు జరిగాయి.

Minister Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్

ఆనాడు నిజాం నిరంకుశ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తి దాయకం.. సర్దార్ సర్వాయి పాపన్న,కొండ లక్ష్మణ్ బాపూజీ ,కొమురం భీమ్ ఇలా అందరూ మన వర్గాల కోసం మన హక్కుల కోసం పోరాడిన వాళ్ళే.. మన అందరికీ చాకలి ఐలమ్మ స్ఫూర్తి .. జయంతి లోపు ఐక్యంగా మనం కలిసి పోరాడదాం. వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నా బడుగు బలహీన వర్గాల సంఘాలకు ఉద్యమకారులకు కోరుతున్న కుల గణన తీర్మానం , నిధుల కేటాయింపు ,బీసీ కమిషన్ ఏర్పాటు ,కమిటీ ఏర్పాటు అన్ని జరిగాయి. కుల గణన జరిగి తీరుతుంది. ఎక్కడ కూడా బీసీ లకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం కి లేదు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో బలహీన వర్గాల ఫెడరేషన్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా కార్యాచరణ తీసుకుంటాం.. భవిష్యత్ లో రాజకీయ, ఆర్థిక ,సామాజిక ఐక్యత తో ముందుకు రావాలి..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.