Site icon NTV Telugu

Ponnam Prabhakar : అద్దె బస్సుల యజమానుల సమస్యలపై చర్చిస్తాం

Ponnam

Ponnam

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు.. ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో అద్దె బస్సుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అద్దె బస్సుల యజమానులు స్వాగతించారు.. కాని తమ బస్సుల పై పడుతున్న భారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం వల్ల కేఏంపిఎల్ పై ప్రభావం పడుతుందని తెలిపారు.. ఆర్టీసీ సంస్థకు చెందిన ప్రయాణికుల తో వెళితే 60 రూపాయలు ఖర్చు అయితే తమ బస్సు 35 రూపాయలు మాత్రమే అవుతుందని తెలిపారు. గతంలో ఉన్నదానికి ప్రస్తుతానికి 2:75 నుండి 3:00 వ్యత్యాసం అవుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. ప్రస్తుతం కిలోమీటర్ కి ఇస్తున్న 35 రూపాయలకు అదనంగా 2 రూపాయలు పెంచాలని కోరారు..

అద్దె బస్సుల యజమానుల సంఘం నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. .. మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణంపై అద్దె బస్సుల యజమానుల సహకారం ఉండాలని విజ్ఞప్తి చేశారు.. అద్దె బస్సుల యజమానులతో చేసిన 10 సంవత్సరాల అగ్రిమెంట్ ప్రకారమే ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు..

కొత్త అగ్రిమెంట్ వస్తే కొత్త ప్రతిపాదనలు ఉంటాయని వెల్లడించారు.. కేఎంపీఎల్‌ పై ఆర్టీసీ కమిటీలో చర్చిస్తామని ఇన్సూరెన్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటామని తెలిపారు.. అద్దె బస్సుల యజమానులు తమ సమస్యల పై ఎప్పుడైనా కలవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.. ప్రభుత్వంలో మీరు భాగస్వాములని బాధ్యతగా ఉండాలని తెలిపారు.. అద్దె బస్సుల యజమానుల సమస్యల పై 4-5 రోజుల్లో అధికారులతో కలిసి మరోసారి సమావేశానికి పిలుస్తామని తెలిపారు…

Exit mobile version