Site icon NTV Telugu

Ponnam Prabhakar : ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి

Ponnama Prabhakar

Ponnama Prabhakar

లక్డికాపుల్ ని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో ముఖ్య అతిధిగా హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్, రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదిప్ దురశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అడిషనల్ కలెక్టర్ ముధుసుదన్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. హైదరాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై, పెండింగ్ లో ఉన్న పనులపై, వివిధ శాఖల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల పై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిపార్మెంట్ ఏదైనా అధికారులు పాఠశాలల్లో పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురుకులాలు, బీసీ వెల్ఫెర్ హాస్టల్ లలో సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని నగరంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావలని ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు..

ఇక నగరంలో పలు సమస్యలను అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. నగరంలో రెండు మోడర్న్ దోబిఘాట్ల పూర్తైనప్పటికీ న్యాయపరమైన సమస్యలు ఉండడంతో మిషనరీలు తుప్పు పట్టే అవకాశం ఉందని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలిపారు. బీసీ బంధు ద్వారా లబ్దిపోందిన వారికి వృత్తు పనిముట్లు కొన్నవారికి పర్యవేక్షణ జరుగుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ హాస్టల్ లు చాలా వరకు ప్రైవేట్ భవనల్లో ఉన్నాయని వాటి సొంత భవనాల నిర్మాణం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిక్ వెల్ఫెర్ కింద పెండింగ్ వర్క్ పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాకి సంబంధించి 6 హాస్పిటల్ ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం జీవో ఇచ్చిన అప్పుడు నిధులు విడుదల కాలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మన ఊరు మన బడి. మన బస్తీ – మన బడి కార్యక్రమంలో 261 పాఠశాల్లో పనులు ప్రారంభించగా 60 స్కూల్లు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. 691 ప్రభుత్వ పాఠశాలల్లో 97,477 మంది విద్యార్థులు చదువుతుండగా 7,300 మంది పదవ తరగతి చదువుతున్నారని వారికి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో 168 బస్తీ దావఖాన లు 91 పిహెచ్సిలు ఉన్నాయని 77.42 శాతం ప్రభుత్వ హాస్పిటల్ లలో డెలివరిలు జరుగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో స్టడీ సర్కిల్ లేదని దానిని పరిగణన లోకి తీసుకోవాలని కోరారు.. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ప్రభుత్వం తనకి కేటాయించిన నిధుల మేరకు మీ దృష్టికి వచ్చిన మంచి పనులు ప్రజలకు ఉపయోగపడే వాటిపై కేటాయిస్తానని హామీ ఇచ్చారు.. ప్రజలు ప్రశంసించే గలిగే పనులు ప్రొసిడింగ్స్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు..

Exit mobile version