NTV Telugu Site icon

Ponnam Prabhakar : ఆషాఢ మాసం బోనాల జాతరపై మంత్రి పొన్నం సమీక్షా

Bonalu

Bonalu

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,సెక్రటరీ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోటా నీలిమ,మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ,దేవాలయ కమిటీ ,ఇతర స్థానిక ముఖ్యనేతలు.. పోలీస్ , జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి,వాటర్ వర్క్స్ ,విద్యుత్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని , భక్తులకు ఇబ్బందులు కలగకుండా సరైన సౌకర్యాలు చేపట్టేలా సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే.. తెలంగాణలో జులై 7 నుండి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఇక, జూలై 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుంది.