NTV Telugu Site icon

Ponnam Prabhakar : ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

Ponnam Prabhakar

Ponnam Prabhakar

పార్లమెంటు ‌మొదటి ధశ ఎన్నికలు కాగానే మోడికి భయం పట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అదానీ, అంబానీకి తప్పా సామాన్యుడికి‌ న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. పదేండ్లలలో బీఅర్ఎస్, బీజేపి ఏమి చేయలేదని ఆయన అన్నారు. బండిసంజయ్ పై అవినీతి, ఆరోపణలు వచ్చాయి కాబట్టే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని, తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండిసంజయ్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండిసంజయ్ నిజమైన భక్తుడు అయితే గుడిలకి ఏమి చేసాడని, బీఅర్ఎస్ అభ్యర్థి ఆరుకొట్లు లతో ఓట్లని కొనాలని చూసాడు,హొటల్ లొ దొరికిన డబ్బులు బీఅర్ఎస్ వే అని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’అగష్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫి చేస్తాం. రైతులకి వ్యతిరేకంగా నల్లచట్టాలు తీసుకువచ్చింది బిజేపి. మాటలకే పరిమితం అయ్యింది మోడి ప్రభుత్వం. మీ అభ్యర్థి నియంత మోడి అయితే,మా అభ్యర్థి‌ మానవతవాది రాహుల్ గాంధీ. ఎంపిగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ప్రభుత్వం. గొడతామన్నోడికి బుద్ది చెప్పాలి. కరీంనగర్ అభ్యర్థిపై పొన్నం ప్రభాకర్ క్లారిటి. తమ‌పార్టీ నుండి‌ సంకేతాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు మా మద్దతుతో రాజేందర్ రావు నామినేషన్ వేసారు. సీఈసి కూర్చోని అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. బిజేపిలో సఖ్యత లేదు,మేమందరం ఐక్యంగా ఉన్నాం నరేంద్ర మోడిలాగే బండిసంజయ్ కూడ నియంతృత్వం గా వ్యవహరిస్తున్నారు కాబట్టే బిజెపి క్యాడర్ దూరం అవుతుంది’ అని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.