NTV Telugu Site icon

Ponnam Prabhakar : వరి మీద అధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలి

Ponnam Prabhaker Sajjala

Ponnam Prabhaker Sajjala

కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ అయకట్టు పరిధిలోని పంటలకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. 2023 స్పూర్తికి నాంధి పలికిందన్నారు. యాసంగి పంటకి నీరు అందించడానికి మానేరు నుండి నీటిని విడుదల చేసినామన్నారు. వరి మీద అధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలని రైతులకి విజ్ఞప్తి చేశారు. అరుతడి పంటలు వేసి,ప్రభుత్వం నుండి ప్రోత్సాహం తీసుకొనండన్నారు. రైతులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉంటుందని, ప్రజాపాలన లలో ఎలాంటి నిబంధనలు లేవన్నారు. అరు గ్యారంటీ అప్లికేషన్ లో మీకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వండని ఆయన అన్నారు.

 

అధికారం లోకి వచ్చిన నలభై ఎనిమిది గంటలలో రెండు గ్యారంటీ లు అమలు చేస్తున్నామని, 1080 బస్సులు తీసుకు వస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పెద్ద మనసు చేసుకొని‌ సహాకరించాలని, ఇది‌ ప్రజల ప్రభుత్వం… ప్రజలు చెబితే వినే ప్రభుత్వమన్నారు. సెక్రటేరియట్ లో పార్లమెంటు ‌సభ్యులు కూడా వచ్చే అవకాశం లేకుండే,ఇప్పుడు అందరికి అనుమతి ఉందని, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అమలు చేసి తీరుతదన్నారు. 024లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తీసుకువస్తామని.. అందుకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. 2023లో ప్రజలు మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని.. 2024లో ప్రజలు కోరుకుంటున్నా పరిపాలనను అందిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా ముందుకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.