NTV Telugu Site icon

Ponnam Prabhakar : బీజేపీ శవాలపై రాజకీయాలు చేస్తుంది

Ponnama Prabhakar

Ponnama Prabhakar

ప్రజలకు ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఈ సంవత్సరం అందరికి మంచే జరిగి అభివృద్ధి చెందాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. మన ప్రాంతాన్ని,మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం శ్రమ పడాలని సూచించారు. అందరికి శుభం జరిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని పొన్నం తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన ఇప్పుడు ఈ క్షణము రేపు ఎల్లుండి వరకు రావచ్చని, పార్లమెంట్ స్థానిక అభ్యర్థిపై కొంత వ్యతిరేకత ఉన్నా కూడా పార్టీ ఐ కమాండ్ రాష్ట్ర నాయకత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

 

నేతన్నల ఆత్మహత్యపై స్పందించి బతుకమ్మ చీరలు ఆర్డర్లు లేకనే ఆత్మహత్యలు అంటున్న బిజెపికి శవాలపై రాజకీయాలు చేస్తుందని, గత ప్రభుత్వము ఏటా 500 కోట్ల ఆర్డరిస్తే దానికంటే రెట్టింపుగా ఆర్డర్ ఇచ్చి నేతన్నకు పని లేదంటూ ప్రశ్న రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 కాంగ్రెస్ సీట్లను ప్రజలు గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధులను తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.