Site icon NTV Telugu

Ponnam Prabhakar : తెలంగాణలో రెండు భాగాలుగా రాహుల్‌ యాత్ర

Ponnam Prabhakar

Ponnam Prabhakar

27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో రాష్ట్ర యాత్రిస్ విషయంలో అసెంబ్లీ నియోజక వర్గానికి 5 గురు చొప్పున ఎంపిక చేసి పంపాలని డీసీసీ అధ్యక్షులను సూచించమని జోడో యాత్ర యాత్రీస్ చైర్మన్ పొన్నం ప్రభాకర్ వివరించారు. ఆదివారం నాడు గాంధీభవన్ లో జోడో యాత్రిస్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. కన్వీనర్ సిరిసిల్ల రాజయ్య, కో కన్వీనర్ ఈ. వెంకట్రామిరెడ్డి లతోపాటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నియోజక వర్గానికి 5 చొప్పున యాత్రీస్ తో పాటు అనుబంధ సంఘాల నుంచి సభ్యులను ఎంపిక చేసి రాష్ట్ర యాత్రిస్ లను జోడో యాత్రలో పాల్గొనేలా ప్రణాళిక చేస్తున్నామని అన్నారు.
Also Read : LIVE : దేశంలో దీపావళి రోజు ముందే తెచ్చిన కోహ్లీ..!

యాత్ర ను రెండు భాగాలుగా విభజించి మక్తల్ నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రూప్ గా, హైదరాబాద్ నుంచి మద్నూర్ వరకు ఒక గ్రూప్ గా నియమించి రాష్ట్ర యాత్రిస్ లో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వనున్నామని అన్నారు. యాత్రిస్ కమిటీ లో కేవలం యాత్రిస్ కు మాత్రమే పాస్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యాత్రిస్ ను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ప్రతినిధులను నియమించినట్టు వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది. అయితే.. ఈ పాదయాత్ర వచ్చే నెల 8 వరకు తెలంగాణ సాగనుంది.

Exit mobile version