కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే రాజేందర్ రావు నీ గెలిపించండని ఆయన కోరారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎప్పుడైనా అన్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె అదానీ అంబాణీలకు ఇచ్చిన ఆస్తులు గుంజుకొని పేదలకు పంచే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే వానాకాలం పంట లోపు వరికి బోనస్ చేస్తామన్నారు పొన్నం ప్రభాకర్ రావు.
బీఆర్ఎస్ పిల్లి శాపనార్థాలు పెడుతుందని, మా మేనిఫెస్టో లో చెప్పిన విధంగా సంవత్సరానికి 12 వేలు ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆటో కార్మికులకు ఇస్తామన్నారు పొన్నం ప్రభాకర్. మీ ఆశీర్వాదం తో ఎమ్మెల్యే అయ్యాను..మంత్రి అయ్యానని, రాజేందర్ రావు నీ పార్లమెంట్ కి పంపించాలన్నారు పొన్నం ప్రభాకర్. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని, హరీష్ రావు రాజీనామా తో సిద్ధంగా ఉండు.. అగ్గిపెట్టె లాగా రాజకీయం చేయకు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
