తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారు… విజయవంతం చేసారన్నారు. 3నెలల్లో 25కోట్ల మహిళలు ఇప్పటివరకు ప్రయాణం చేశారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ప్రావిడెంట్ ఫండ్ నీ వాడుకున్నారు గతంలో… బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ఇప్పుడు 2017 PRC పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నామని, ఆర్టీసీ నష్టాల నుంచి ప్రాఫిట్ ఒరిఎంటేషన్ వైపు గా వెళ్తున్నామన్నారు. ఫిట్‌మెంట్ 21% ఇవ్వాలని నిర్ణయించాము… దీనివల్ల ఏడాదికి భారం పడుతుంది.. అయినా కూడా ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Shaitaan: సైతాన్ గా మాధవన్.. ఏం చేశావన్నా యాక్టింగ్.. వెర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నావ్
అంతేకాకుండా.’దీనితో సాలరీ లు పెరగనున్నాయి… జూన్ 1 నుంచి అమలు అవుతాయి… ఆర్టీసీ బస్సులు అక్యూపెన్సీ పెరిగింది… సౌకర్యాల కల్పన కూడా పెంచుతున్నాం… ఈమధ్య కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు…. పేద ప్రజలకు ప్రయాణం సాధనం ఆర్టీసి.. ఆర్డినరీ బస్సులకు express బస్సుల కలర్స్ వేసి నడపుతున్నాం అనటం వాస్తవం కాదు.. ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగింది.. వారిని ఆదుకుంటాం.. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారు.. గతంలో ఉన్న మాజీ మంత్రులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. మమ్మల్ని ఆటో కార్మికులకు 15వేలు ఇవ్వాలని కోరుతున్నారు..’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Chandrababu: ఈ నెల 17న ఏపీకి ప్రధాని మోడీ.. బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచన