మరోసారి సీఎం కేసీఆర్‌పై మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. నేడు సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం గోపురానికి కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. కేసీఅర్ చేసిన పాపాలకు దేవుడికి బంగారం ఇవ్వడం ప్రాయచ్చితం అనుకుంటున్నారని విమర్శించారు.
అంతేకాకుండా.. ఏ సీఎం కూడా ఇంత పెద్ద దోపిడీ చేయలేదని, యాదాద్రికి కొత్త పార్టీ కోసం వెళ్ళాడన్నారు. దోపిడీ సొమ్ముతో దేశ రాజకీయం చేస్తా అంటున్నారు ప్రజలు ఆలోచన చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. రేపు భద్రకాళి గుడికి వెళ్తారట.. దేవాదుల మూడో విడత.. మోటార్లు నడిపి ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నాడు అని మండిపడ్డారు.