NTV Telugu Site icon

Ponguleti Sudhakar Reddy : అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదే

Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudhakar Reddy

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. వైరా శాస్తా నగర్ లోని సాయిబాబా ఆలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు, మాజీమంత్రి కాకతీయ వంశస్థులు కమల్ మంజు దియా కాకతీయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ షో ప్రారంభం సందర్భంగా డప్పు వాయించారు వినోద్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా పొంగిలేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీదే అని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని, పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి 400 సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి. ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద రావు సునాయాసంగా గెలుస్తారని, తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి.

అంతేకాకుండా..’కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 150 రోజుల్లోనే తేలిపోయింది. గ్యారంటీ పథకాలు నేటికీ నోస్కోలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి బిజెపి ప్రభుత్వాన్ని గాడిద గుడ్డు పేరుతో చలోక్తులు విసురుతున్నారు. గాడిద గుడ్డు అనేది తెలంగాణ రాష్ట్రంలోనే చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయం.’ అని పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు.