Ponguleti Srinivas Reddy : వరంగల్ భద్రకాళి బండ్, భద్రకాళి ఆలయం లో చేపట్టనున్న అభివృద్ధి పనులను జిల్లా ఉన్నత అధికారులతో రాష్ట్ర రెవెన్యూ, హోసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. దశాబ్దాల కాల మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అవాంతరాలు తొలిగిపోయాయని, కేంద్రం అనుమతి ఇస్తే ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తోందన్నారు మంత్రి పొంగులేటి. భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రకాళి జలాశయంను తాగు నీటి జలయశంగా మారుస్తామని, భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిని పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చెరువు పై సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
RK Roja: సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు